హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం పడి పడి లేచే మనసు. నేడు సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ముందు నుంచి సినిమాపై ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.  ఇక అమెరికాలో ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా ఫస్ట్ టాక్ ఏమిటంటే..

సూర్య పాత్రలో కనిపించిన శర్వానంద్ మరోసారి తన సింపుల్ నటనతో ఓ వర్గం వారిని బాగా ఆకర్షిస్తాడు. ఇక సాయి పల్లవి కూడా తన సరికొత్త షెడ్ ను సినిమాలో చూపించే ప్రయత్నం చేసింది. చిత్ర యూనిట్ చెప్పినట్టుగానే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దర్శకుడు హను మరోసారి లవ్ సీన్స్ ను తనదైన శైలిలో చూపించి మెప్పించాడు. అయితే కథలో పెద్దగా ఆశ్చర్య పరిచే విషయం ఏమి లేదు. 

సగటు ఆడియెన్స్ ముందుగానే పసిగట్టే అంశాలు చాలా ఉన్నాయి. సినిమాలో ఒక దశలో బోరింగ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా నామమాత్రంగానే ఉంటుంది. ఒక జంట మధ్య ప్రేమ ఎన్ని విధాలుగా మారుతుందో కోపాలు అలకలు అంటూ పడి పడి లేచే మనసు అనే టైటిల్ ను కరెక్ట్ గా ఇచ్చారు. సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ సాంగ్స్. విజువల్ పరంగా సూపర్బ్. నిర్మాణ విలువలు బావున్నాయి. నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ పరవలేదనిపించగా సెకండ్ హాఫ్ చివరలో బోరింగ్ అనిపించవచ్చు అనే టాక్ వస్తోంది. మరి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.