శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'పడి పడి లేచే మనసు'. ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంతో తన వైవిధ్యతను చూపించే దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను రూపొందించాడు.

కోల్‌కత బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కించారు. సూర్య అనే కుర్రాడు, డాక్టర్ చదువుతోన్న వైశాలి అనే ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామానే ఈ సినిమా. సూర్య పాత్రలో శర్వానంద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సాయి పల్లవి మరోసారి తన నటనతో యూత్ ని ఫిదా చేయడానికి రెడీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

ఈ సెన్సిటివ్ లవ్ స్టోరీయూత్ ని మెప్పించడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో హను రాఘవాపూడి మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నేపధ్య సంగీతం ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. డిసంబర్ 21న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.