Asianet News TeluguAsianet News Telugu

' కేజీఎఫ్' కథతోనే విక్రమ్ కొత్త చిత్రం, తేడా ఏంటంటే...

ఈ నేపధ్యంలోనే చియాన్ విక్రమ్ తోచేయబోయే సినిమా కథ కూడా నిజజీవిత సంఘటనలని స్ఫూర్తిగా తీసుకొని కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆవిష్కరించడానికి రెడీ అయ్యాడు.

Pa Ranjith's period film with Vikram, set in KGF
Author
First Published Oct 13, 2022, 10:29 AM IST


ఈ సంవత్సరం  యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 భాక్సాఫీస్ దగ్గర ఎంత హంగామా సృష్టించిందో తెలియంది కాదు.  కన్నడ, బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు ప్రతి భాషలో హయ్యెస్ట్ గ్రాసర్ గా కేజీఎఫ్ 2 నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా 1500 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కేజీఎఫ్ 2 నిలిచింది. 
 
బాహుబలి సిరీస్ తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధికంగా కలెక్ట్ చేసిన చిత్రంగా ఇది నిలిచింది. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ . ఆ నేపధ్యాన్ని తీసుకొని కంప్లీట్ ఫిక్షన్ కథతో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేజీఎఫ్ కాన్సెప్ట్ తో సౌత్ ఇండియాలో మరో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది.

కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. తాజా అప్డేట్ ప్ర‌కారం 18 వ శ‌తాబ్దం బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండ‌నుంద‌ట‌. అంతేకాదు క‌థానుగుణంగా అవ‌స‌ర‌మైన సెట్స్ కూడా నిర్మించిన‌ట్టు  టాక్‌. ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌(3D format) లో తీయ‌నుండ‌టం. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లే, ప్రజెంటేషన్‌తో ఆక‌ట్టుకోవ‌డం పా రంజిత్ స్పెషాలిటీ. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌, నీల‌మ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాశ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ కానుంది.

ఇక ఈ చిత్రం పూర్తిగా నిజమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కార్మికుల కథతో తెరకెక్కుతుంది. దీనిలో కూడా కొంత ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా పా రంజిత్ కథలు నిజజీవితానికి దగ్గరగా నేచురల్ ఎమోషన్స్, ఎలిమినెంట్స్ తోనే ఎక్కువగా ఉంటాయనేది నిజం. ఈ నేపధ్యంలోనే చియాన్ విక్రమ్ తోచేయబోయే సినిమా కథ కూడా నిజజీవిత సంఘటనలని స్ఫూర్తిగా తీసుకొని కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆవిష్కరించడానికి రెడీ అయ్యాడు.

రీసెంట్ గా చియాన్ విక్రమ్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టడంతో పాటు ఆదిత్య వర్మ కరికాలన్ పాత్రలో సినిమాలో మెప్పించాడు. మరో వైపు మహావీర్ కర్ణ సినిమా కూడా చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ఉండబోతుంది. వీటి కంటే ముందుగా పా రంజిత్ సినిమాని కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios