మే 30న ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో అఖండ విజయంతో ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన జగన్ కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గాన కోకిలగా పేరుగాంచిన లెజెండ్రీ సింగర్ పి సుశీల తాజాగా జగన్ ని అభినందించారు. 

జగన్ ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి అయ్యారని ప్రశంసించారు. జగన్ కు ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. వైఎస్సార్ ముఖమంత్రిగా అద్భుతమైన పాలన అందించారు. జగన్ కూడా తండ్రి బాటలోనే నడవాలి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ ట్రస్టు ద్వారా ఎందరో కళాకారులని అందుకున్నారని, వారికీ ప్రోత్సాహకాలు అందించారని సుశీల గుర్తు చేసుకున్నారు. 

రాజశేఖర్ రెడ్డిగారి ఆశయాలకు అనుగుణంగా జగన్ జనరంజకమైన పాలన అందించాలని కోరారు. సినీ, రాజకియ ప్రముఖుల నుంచి జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.