చిత్రం- ఓయ్ నిన్నే తారాగణం-భరత్ మార్గని, శృష్టి డాంగే సంగీతం- శేఖర్ చంద్ర దర్శకత్వం- సత్యం చల్లకోటి నిర్మాత-వంశీకృష్ణ శ్రీనివాస్ ఆసియానెట్ రేటింగ్-2.75/5
ఇటీవల కాలంలో లో బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న సినిమాల లిస్ట్ బాగానే పెరుగుతోంది. అందుకు ఉదాహరణ విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి. ఈ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా అదే కోవలో భరత్ మార్గని హీరోగా వచ్చిన మూవీ “ఓయ్ నిన్నే”. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా...
కథ:
మన సంతోషానికి దగ్గరగా ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటామని నమ్మే ఓ కుర్రాడు విష్ణు(భరత్ మార్గాని). కాలేజీలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఓ దశలో ప్రేమా? కుటుంబమా? రెండిటిలో ఏదో ఒకదాన్నే ఎంపిక చేసుకోమని అమ్మాయి కోరుతుంది. ఆమె మాట వింటే ప్రేమ... అతని మనసు మాట వింటే కుటుంబం ఉంటుంది. అప్పుడతను ఏం చేశాడనే కథతో రూపొందిన సినిమా 'ఓయ్.. నిన్నే'.
విశ్లేషణ:
పరశురామ్, చందూ మొండేటి, సుధీర్ వర్మ, కృష్ణచైతన్యల వద్ద దర్శకత్వ శాఖలో పని చేశాడు దర్శకుడు సత్య చల్లకోటి. అతనికిదే మొదటి చిత్రం అయినా అనుభవమున్న దర్శకుడిలా ‘ఓయ్.. నిన్నే'ను తీర్చిదిద్దాడు. తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయ బేధాలు, బావా మరదళ్ల మధ్య ప్రేమకథ ఈ చిత్రానికి హైలైట్. భరత్, సృష్టిలు కొత్తవాళ్లైనా అద్భుతంగా నటించారు. ఇందులో హీరోది ముక్కుసూటి మనస్తత్వం. మనసులో మాటను ఎదుటివ్యక్తి మొహం మీదే చెప్పేస్తుంటాడు. అతనికది కొన్నిసార్లు ప్లస్ అయితే, ఇంకొన్నిసార్లు మైనస్ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో అతనికి ఎలాంటి అభిప్రాయబేధాలు వచ్చాయి. మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు అనే చిత్రకథతో స్క్రీన్ ప్లేలో వేరియేషన్ చూపి దర్శకుడు సత్య చల్లకోటి ప్రేక్షకును ఆకట్టుకునేందుకు తన శక్తియుక్తులన్నీ పెట్టి చిత్రాన్ని తెరకెక్కించాడు.
నటన పరంగా చూస్తే చిత్రంలో హిరో, హిరోయిన్లు ఇద్దరికీ మంచి మార్కులే పడ్డాయి. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు' రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్ తదితరులు తమతమ పాత్రలకు తగిన విధంగా న్యాయం చేశారు.

సాంకేతికంగా:
ఈ చిత్రానికి సాంకేతికపరంగా చూస్తే దర్శకుడి పనితీరును మెచ్చుకోవాలి. రొటీన్ కథే అయినా.. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం. ఇక సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పాలి. శేఖర్ చంద్ర సంగీతం కూడా మరో ఎసెయ్. మార్తాండ్ కె. వెంకటేష్ కొన్ని చోట్ల సాగదీతలా అనిపించినా.. ఓవరాల్ గా ఎడిటింగ్ ఫరవాలేదనిపించారు. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ తో పాటు స్టంట్ మాస్టర్ వెంకట్ ఫైట్స్ కూడా ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
చివరగా:
ఓయ్ నిన్నే లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన సినిమాలు రొటీన్
