Asianet News TeluguAsianet News Telugu

‘జాతిరత్నాలు’ ఆ జనాలకు అసలు ఎక్కలేదా?

 కేవలం 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో మూడు వారాల్లోనే 35 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఆ సక్సెస్ స్టోరీ ఓటీటి కు వచ్చేసరికి తిరగబడింది.

Ott Talk On Jathi Ratnalu Movie  jsp
Author
Hyderabad, First Published Apr 14, 2021, 11:30 AM IST

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఒకేరోజు మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి.వాటిలో జాతి ర‌త్నాలు ఒక‌టి. మిగిలిన రెండు సినిమాల‌తో పోలిస్తే.. జాతిర‌త్నాల‌కే మంచి టాక్ వ‌చ్చింది. సినిమా బాగుందన్నారు.కానీ ఈ స్దాయి హిట్ ని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత మెల్లిగా మౌత్ టాక్ పెరిగింది. తొలి రోజే.. మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.  ఆదివారానికి బ్రేక్ ఈవెన్ లో ప‌డింది. జాతి ర‌త్నాలు జోరు మ‌రో వారం రోజుల వరకూ ఉండే అవకాసం ఉందని లెక్కలువేసినవారి అంచనాలు తప్పాయి. ఈ సినిమా అదిరిపోయే లాభాలు సంపాదించింది.  కేవలం 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో మూడు వారాల్లోనే 35 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఆ సక్సెస్ స్టోరీ ఓటీటి కు వచ్చేసరికి తిరగబడింది.

జాతిరత్నాలు సరిగ్గా నెల రోజుల గ్యాప్ తో మొన్న అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. థియోటర్స్ లో తెగ నవ్వేసుకున్నారు జనం. కానీ చిత్రంగా ఓటీటికు వచ్చేసరికి నచ్చటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్దాయి హిట్ మూవీకి ఓటిటిలోనూ బ్రహ్మరధం దక్కుతుందని అనుకుంటే రివర్స్ గేర్ లో విషయం సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. థియేటర్లో చూడని ప్రేక్షకులు ఆన్ లైన్లో చూద్దామని ఎదురుచూసారు. చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇందులో కామెడీ ఏముందని పెదవి విరుస్తున్నారు. 

అయితే ఈ నేపధ్యంలో సినిమా జనాలకు ఓ విషయం స్పష్టమైంది. థియేటర్ కు ఓటిటి కు ఆడియన్స్ టేస్ట్ లలో చాలా తేడాలుంటాయి. జనం మధ్య చూసిన సినిమాకు ..ఒంటరిగా లేదా ఇద్దరో ముగ్గురో కూర్చుని సెల్ ఫోన్ లేదా ట్యాబ్ , టీవిల్లో చూసే  సినిమాకు ఎక్సపీరియన్స్ లో చాలా తేడా ఉంటుంది. జాతిరత్నాలు విషయంలో జరుగుతోంది. దాంతో రేపు ఉప్పెన నెట్ ఫ్లిక్స్ లో వస్తున్నప్పుడు  ఆన్ లైన్ జనం ఎలా స్పందిస్తారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios