Asianet News TeluguAsianet News Telugu

అమీర్ ఖాన్ కష్టానికి హాలీవుడ్ గుర్తింపు, లాల్ సింగ్ చడ్డాను ప్రస్తావించిన ఆస్కార్ టీమ్

భారీ అం చనాల మధ్య రిలీజ్ అయిన లాల్ సింగ్ చడ్డాకు.. పెద్దగా సక్సెస్ అందకపోయినా..అరుదైన గుర్తింపు మాత్రం లభించింది. ఇంతకీ  లాల్ సింగ్ చడ్డాకు లభించిన ఆ స్పెషల్ గుర్తింపేంటి. 

oscars official page honours aamir khans laal singh chaddha Movie
Author
Hyderabad, First Published Aug 13, 2022, 3:06 PM IST

చాలా కాలం వెయిటింగ్ తరువాత భారీ అంచనాలతో చుట్టూ కాంట్రవర్సీలతో రిలీజ్ అయ్యింది ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీ. ఇక ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇండియాన్  బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఆమిర్ గత అమీర్ ఖాన్ సినిమా అంటే ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ పక్కాగా ఉంటాయి. కాని ఈ సారి మాత్రం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాక తొలి రోజు చాలా తక్కువ వసూళ్లు రాబట్టింది. అటు రివ్యూలు కూడా  వ్యతిరేకంగా వచ్చాయి. 

ఈ సినిమాపై మొదటి నుంచీ వ్యాతిరేక ప్రచారం జరిగింది. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ  సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు.  ఈ సినిమాను బహిష్కరించాలంటూ ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇన్ని ఇబ్బందుల నడుమ  సినిమాను రిలీజ్ చేసిన అమీర్ ఖాన్ కు నిరాశ ఎదురైనా.. అదే  ప్రతికూలతల నడుమ ఆమిర్ ఖాన్ కు  హాలీవుడ్ నుంచి కాస్త ఊరట లభించింది. అరుదైన గౌరవం కూడా లభించింది. 

ఆస్కార్ నుంచి  లాల్ సింగ్ చడ్డా మూవీకి  గుర్తింపు లభించింది.  టామ్ హాంక్స్ తీసిన హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ కు ఇండియాన్ రీమేక్ గా లాల్ సింగ్ చడ్డా ను ఆస్కార్ గుర్తించింది. సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మద్దతు తెలిపింది. అస్కార్ అవార్డు పొందిన ఒరిజినల్ మూవీ ఫారెస్ట్ గంప్ మ్యాజిక్ ను హిందీలో తిరిగి ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్ ను షేర్ చేసింది.

 

రాబర్ట్ జెమెకిస్, ఎరిక్ రోత్ అందించిన  సినిమా కథ భారతీయుల ఆదరణ కూడా పొందింది. ఈ కథను అద్వైత్ చందన్‌, అతుల్ కులకర్ణి భారతీయతకు తగ్గట్టు మార్చుకున్నారు అని క్యాప్షన్ ఇచ్చింది.  ఇక ఈ వీడియోలో రెండు  సినిమాలను కంపైర్ చేస్తూనన కొన్ని సీన్స్ ను పోల్చారు.  ఇక మాలీవుడ్ ఒరిజినల్  సినిమాలో సీన్స్ ను ఎలా  పునర్నిర్మించారో కూడా  ఈ క్లిప్ చూపించింది. 

1994లో విడుదలైంది  ఫారెస్ట్ గంప్  సినిమా. ఈ సినిమా  దాదాపు 13 ఆస్కార్‌లకు నామినేట్ అయింది. ఈ సినిమా నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే మరియు ఉత్తమ చిత్రంగా ఆరు అస్కార్ అవార్డులు వచ్చాయి. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాను కూడా ఆరేంజ్ లో పొడుడుతున్నారు. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ జోడీగా కరీనా కపూర్ నటించగా అమీరో్ తో పాటు టాలీవుడ్ యంగ్ స్టార్ నాగచైతన్య ఈ సినిమాలోకీలక పాత్రలో నటించి మెప్పించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios