Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ దర్శకులకు గడ్డి పెట్టిన ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు!

భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డు ఒక కలగానే మిగిలిపోతోంది. ఎప్పుడూ హాలీవుడ్ చిత్రాలే అక్సార్స్ లో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ తన సతీమణి కరోల్ తో కలసి ఇండియాలో పర్యటించారు. 

oscars academy head john bailey about Indian movies
Author
Mumbai, First Published May 27, 2019, 3:15 PM IST

భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డు ఒక కలగానే మిగిలిపోతోంది. ఎప్పుడూ హాలీవుడ్ చిత్రాలే అక్సార్స్ లో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ తన సతీమణి కరోల్ తో కలసి ఇండియాలో పర్యటించారు. ముంబయిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతీయ చిత్రాలు ఎందుకు ఆస్కార్ అవార్డు గెలుచుకోలేకున్నాయో వివరించాడు. 

జాన్ బెయిలీ మాట్లాడుతూ ముంబయిలో ఆస్కార్స్ అకాడమీకి సంబంధించిన కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ మూవీకి కూడా ఆస్కార్ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు బెయిలీ సమాధానం ఇచ్చాడు.మాకు ఇండియన్ చిత్రాల గురించి ఏమి తెలియదు అని నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చాడు. మాకు భారతీయ చిత్రాల గురించి ఎలాంటి విషయాలూ తెలియడం లేదు. అందుకే ఆస్కార్ అవార్డు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పాడు. 

ఇందులో మా తప్పేమి లేదు. ప్రపంచం మొత్తానికి తెలిసేలా ఇండియన్ దర్శకులు, నిర్మాతలు ఒక్క చిత్రం కూడా చేయలేకపోయారు అని బెయిలీ చురకలంటించారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడి విభిన్న ఆచారాలు, సంస్కృతులు గురించి ఎన్నో మంచి విషయాలు విన్నా. కానీ భారతీయ సంస్కృతులని ప్రతిభించిందే చిత్రం ఒక్కటి కూడా మా వరకు చేరలేదు. 

సంస్కృతులు, విలువలు ఉన్న చిత్రాలకే ఆస్కార్స్ లో ప్రాధాన్యత ఉంటుందని బెయిలీ అన్నారు. మీ గురించి ప్రపంచానికి తెలిసేలా  చేయాల్సిన భాద్యత మీ ;దర్శకులదే అని బెయిలీ సూచించారు. తన వ్యాఖ్యల ద్వారా ఇండియన్ దర్శకులకు బెయిలీ పరోక్షంగా చురకలు అంటించారు. ఇండియాలో ఏడాదికి 1800 సినిమాలు నిర్మించబడుతున్నాయి. హాలీవుడ్ కంటే నాలుగురెట్లు ఎక్కువ. ఆస్కార్ అవార్డులు కేవలం హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే కాదు. ప్రపంచానికి తెలిసేలా సినిమా చేస్తే ఇండియన్ చిత్రాలకు కూడా ఆస్కార్ అవార్డు వస్తుంది అని బెయిలీ అన్నారు. ఇండియాలో ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్ లోనే చిత్రాలు తెరకెక్కిస్తుంటారనే విమర్శ ఎలాగూ ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios