ప్రభాస్‌ హీరోగా `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు రానటువంటి కథతో సైన్స్ ఫిక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భారీ కాస్టింగ్‌ ని తీసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇక టెక్నీషియన్ల పరంగానూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లని తీసుకోబోతున్నారట. అందులో భాగంగానే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌. రెహ్మాన్‌ని ఎంపిక చేశారు. దీంతో సినిమాపై భారీ హైప్‌ వచ్చేసింది. 

అయితే కాస్టింగ్‌, క్రూ భారీగా ఉండటంతో సినిమా లెవల్‌ పెరిగింది. కానీ రెహ్మాన్‌ రెమ్యూనరేషన్‌ విషయంలోనే చిత్ర నిర్మాణ సంస్థ షాక్‌ అవుతుంది. జనరల్‌గా ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అయిన కోటీ లోపే ఉంటుంది. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లకి కోటికిపైనే ఇస్తుంటారు. కానీ రెహ్మాన్‌కి మాత్రం ఈ చిత్రానికి దాదాపు నాలుగు కోట్లు పారితోషికంగా డిమాండ్‌ చేస్తున్నారట. దీంతో ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ప్రభాస్‌ టీమ్‌ని రెహ్మాన్‌ బాగా పిండుతున్నాడుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే రెహ్మాన్‌కి ఆ మొత్తాన్ని అందించేందుకు ఓకే చెప్పినట్టు టాక్‌. 

వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమాలపై పతాకాలపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఓ విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దాలని నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు. పాన్‌ ఇండియాని మించి ఈ సినిమా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.