Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ షో!

ఆస్కార్ వేదికపై ఈ పాటను ప్రదర్శించడానికి కీరవాణి తో పాటు రచయిత చంద్రబోస్ కు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. 

Oscar Awards 2023 Keeravani Will Perform On Oscars Stage, check details
Author
First Published Feb 8, 2023, 6:43 AM IST


'ఆర్ఆర్ఆర్' (RRR Movie)   మూవీలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది.  ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో కీరవాణి ఆస్కార్ వేదిక పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. దాంతో ఇప్పుడు భారతీయ ప్రేక్షకులు అందరి దృష్టి మరోసారి ఆస్కార్ అవార్డుల మీద పడింది. ద అకాడమీ అవార్డ్స్ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్) మొత్తం 23 విభాగాల్లో అవార్డులు ఇస్తుంది. అందులో 10 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల వివరాలను డిసెంబర్ 22న వెల్లడించింది. నామినేషన్స్ కంటే ముందు షార్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారు. సాంగ్స్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయిన 15 పాటల్లో 'నాటు నాటు...' ఉంది.  మొత్తం 81 పాటలు ఈ విభాగంలో పోటీ పడటానికి అర్హత సాధించగా... అందులో 15 పాటలను మాత్రమే షార్ట్ లిస్టుకు ఎంపిక చేశారు. ఆ పదిహేనులో 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' ఒకటి. 

ఈ నేపథ్యంలో ఆస్కార్ వేదికపై ఈ పాటను ప్రదర్శించడానికి కీరవాణి తో పాటు రచయిత చంద్రబోస్ కు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. అయితే ఇలా ఆస్కార్ వేదికలపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఏ ఆర్ రెహమాన్ ‘జై హో’ పాటను ఇలాగే లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే ఈసారి కీరవాణి ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారనే వార్తలు రావడంతో ఆసక్తి నెలకొంది.   ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. వీరంతా ఓ వారం రోజుల ముందుగానే ఈ కార్యక్రమానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలందించారు. గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.  గతేడాది మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా యావత్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మన ఇండియా నుంచి 'చెల్లో షో' (ద లాస్ట్ ఫిల్మ్ షో) 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్' కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యింది. 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్' కేటగిరీలో 'ఆల్ ద బ్రీత్స్'... 'బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' కేటగిరీలో 'ద ఎలిఫాంట్ విష్పర్స్' కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios