'పవర్ స్టార్' టైటిల్ ఫిక్స్!

'పవర్ స్టార్' టైటిల్ ఫిక్స్!

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఏది చేయడం లేదు కదా మరి టైటిల్ ఫిక్స్ చేయడం ఏంటి.. అనుకుంటున్నారా..? అసలు కథ వేరే ఉంది. 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రంతో మలయాళంలో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఒమర్ లులూ. ప్రస్తుతం ఆయన 'ఒరు అడార్ లవ్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రియాప్రకాష్ వారియర్ నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మాణిక్య మలరా అనే పాటతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అప్పటివరకు ప్రియాప్రకాష్ అంటే ఎవరికీ తెలియదు. ఈ పాటలో తన కన్నుకొడుతూ కనిపించి యూత్ ను ఫిదా చేసింది ఈ బ్యూటీ. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో దర్శకుడు ఒమర్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.

ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా ప్రకటించాడు. అదే 'పవర్ స్టార్'. నా తదుపరి సినిమా 'పవర్ స్టార్'కు మీ అందరి ఆశీస్సులు కావాలని అభిమానులను కోరాడు ఒమర్. మరి పవర్ స్టార్ గా నటించనున్న హీరో ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే! 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos