కెరీర్ మొదట్లో ప్రేమ కావాలి - లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ ఆ తరువాత మరో సక్సెస్ అందుకోలేదు. ఎన్ని ప్రయోగాలు చేసిన అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. అయితే ఇప్పుడు ఒక ఫిక్షనల్ స్టోరీతో రాబోతున్నాడు ఈ యువ హీరో. అదే ఆపరేషన్ గోల్డ్ ఫిష్. 

నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సాయి కిరణ్ అడివి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది. రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో సినిమా ఫైనల్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఈ సినిమాపై కథానాయకుడు ఆది చాలా నమ్మకంగా ఉన్నాడు. 

ఒక NSG కమాండోగా ఆది ఈ సినిమాలో కనిపించనున్నాడు. పార్వతీశం - కార్తీక్ రాజు ఇంకా ఎయిర్టెల్ 4g గర్ల్ సాషా ఛెత్రి ముఖ్య పాత్రలో నటించారు. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు తెలియజేశాడు.