Asianet News TeluguAsianet News Telugu

వినాయక చవితికి ఆ ఒక్క సినిమానే రిలీజ్, 'చంద్రముఖి 2' కూడా వెనక్కే...

 'సలార్' పార్ట్-1 సినిమా వాయిదా పడటంతో అంతా ప్లాన్ అంతా దెబ్బకొట్టింది. స్కంధ ఆ డేట్ కు వెళ్లిపోయింది. సెప్టెంబర్ 15వ తేదీన రావాల్సిన 'స్కంద' సినిమాని  ఈ నెల 28వ తేదీకి షిఫ్ట్ చేసారు.

Only dubbed film #MarkAntony is releasing on Sep 15 jsp
Author
First Published Sep 8, 2023, 3:09 PM IST


రాబోయే  వినాయక చవితి సీజన్ మాత్రం సినిమాల పరంగా పెద్ద హంగామాగా జరిగేటట్లు కనపడటం లేదు.  ఈసారి వినాయక చవితికు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదు. అదే సమయంలో రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయనుకుంటే అందులో ఒకటి సైడ్ అయ్యిపోయింది.  

వాస్తవానికి  రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన 'స్కంద' చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అదే రోజున  రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2'.. విశాల్ హీరోగా రూపొందిన 'మార్క్ ఆంటోనీ' వంటి తమిళ్ డబ్బింగ్ సినిమాలు అదే రోజున విడుదల ప్లాన్ చేసుకున్నాయి.  అయితే 'సలార్' పార్ట్-1 సినిమా వాయిదా పడటంతో అంతా ప్లాన్ అంతా దెబ్బకొట్టింది. స్కంధ ఆ డేట్ కు వెళ్లిపోయింది. సెప్టెంబర్ 15వ తేదీన రావాల్సిన 'స్కంద' సినిమాని ఈ నెల 28వ తేదీకి షిఫ్ట్ చేసారు. లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుందనేది వీరి ఆలోచన. 

మరి వినాయిక చవితికి ఆ రెండు డబ్బింగ్ సినిమాలు అయినా వస్తున్నాయా అంటే విఎఫెక్స్ పనులు లేటు అవుతూండటంతో చంద్రముఖి 2 కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇక మిగిలింది చివరకు  'మార్క్ ఆంటోనీ'  మాత్రమే. మరి ఇది గమనించి వేరే సినిమాలు ఏమైనా సీన్ లోకి వస్తాయేమో చూడాలి.
 
ప్రస్తుత కాలంలో ఓ సైంటిస్టు చేసిన ట్రైమ్ ట్రావెల్ ఫోన్ సక్సెస్ అవుతుంది. దీంతో మార్క్ టైమ్‍లో వెనక్కి వెళతారు. తన తండ్రి ఆంటోనీ కోసం వెతుకుతారు. మొత్తంగా మార్క్ ఆంటోనీ ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. టైమ్ ట్రావెల్, గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామా, కామెడీతో ఆకట్టుకుంది. విశాల్,  ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో, అధిక్ రవి చంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మార్క్ ఆంటోనీ. రితూ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 15, 2023న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్  లభించింది.  ఈ చిత్రంలో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సునీల్, సెల్వరాఘవన్ వంటి ప్రతిభావంతులైన నటులతో స్క్రీన్‌ను పంచుకుంటూ తండ్రి మరియు కొడుకుల పాత్రలను పోషిస్తున్నాడు విశాల్. మార్క్ ఆంటోనీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios