టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున నటిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. ఎన్ ఐ ఏ విభాగంలో పనిచేసే ఏసీపీగా ఆయన యాక్షన్ అడ్వెంచర్స్ అధ్బు తంగా ఉంటాయని వినికిడి. ఇక నాగార్జున బర్త్ డే కానుకగా ఈ మూవీ నుండి ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. తన టీమ్ సభ్యులతో డేంజరస్ ఆపరేషన్స్ నిర్వహించే అధికారిగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తుంది. 

కాగా నేడు సాయంత్రం ఈ మూవీ నుండి మరో అప్డేట్ రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు వైల్డ్ డాగ్ మూవీపై కీలక అప్డేట్ రానుందని సమాచారం. మరి ఈ అప్డేట్ ద్వారా టీజర్ విడుదల చేస్తారా లేక మోషన్ పోస్టర్ ఏమైనా రానుందా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. 

అనౌన్స్మెంట్ పోస్టర్ పై ట్రెండ్ సెట్టర్ మరో ట్రెండ్ సెట్టింగ్ అప్డేట్ తో వస్తున్నారని ఉంది. మరి ఆ ట్రెండ్ సెట్టింది అప్డేట్ ఏమిటో చూడాలి. దర్శకుడు అహిషోర్ సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మీర్జా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.