ఇలా అయితే కష్టం.. గేమ్ ఛేంజర్ నుంచి పూనకాలు తెప్పించే సీన్ లీక్
తాజాగా ఈ మూవీ నుంచి అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన దృశ్యాలు లీకై పోయాయి. దీనితో చిత్ర యూనిట్ కి మరో షాక్ తప్పలేదు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వరుస లీకులు చిత్ర యూనిట్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. రాంచరణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. ఒక లుక్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేయగా మరొకటి లీక్ అయింది. అంతే కాదు గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎక్కడ జరిగినా అక్కడి నుంచి లీక్స్ బెడద తప్పడం లేదు.
తాజాగా ఈ మూవీ నుంచి అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన దృశ్యాలు లీకై పోయాయి. దీనితో చిత్ర యూనిట్ కి మరో షాక్ తప్పలేదు. రాంచరణ్ హెలికాప్టర్ తో తో మార్కెట్ లో ల్యాండ్ అయ్యే దృశ్యాలకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సన్నివేశం థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించే విధంగా డైరెక్టర్ శంకర్ చిత్రీకరిస్తున్నారట. అలాంటి దృశ్యాలనే లీక్ చేసేశారు. ఇలా అయితే ఇష్టం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు, దర్శకుడు శంకర్ ఈ లీకులని అరికట్టాలని అంటున్నారు.
ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్స్ పాత్రలో అంజలి, కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం మొదలై మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాలిడ్ అప్డేట్ అంటూ లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం ఇంత ఆలస్యం అవుతుండడంతో ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ గా మారింది.