Asianet News TeluguAsianet News Telugu

'మా' ఎలక్షన్స్... బరిలోకి మరొకరు, ఆరుగురు పోటీదారులతో  ఎన్నికలు రసవత్తరం!

 అసాధారణంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారి సంఖ్య ఆరుకి చేరింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించారు.

one more contestant joins in maa president elections here are details ksr
Author
Hyderabad, First Published Jun 28, 2021, 1:48 PM IST

ఎన్నడూ లేని విధంగా 'మా' అధ్యక్ష ఎన్నికల వ్యవహారం నడుస్తుంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే ప్రత్యర్ధులు సమరానికి కాలు దువ్వుతున్నారు.  అసాధారణంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారి సంఖ్య ఆరుకి చేరింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించారు. 

నిన్న నటుడు సీవీఎల్ నరసింహారావు కూడా రేసులో దిగుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణావాదం ప్రధానంగా, ఆఫర్స్ విషయంలో స్థానికులకే ప్రధమస్థానం ఇవ్వాలంటూ ఆయన నినాదం అందుకున్నారు. తాజాగా ఓ కళ్యాణ్ అధ్యక్ష ఎన్నికలలో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ కళ్యాణ్ ప్రకటనతో మొత్తం ఆరుగురు సభ్యులు మా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నట్లు అయ్యింది. 


మొదటి నుండి గెలుపుకోసం ప్రణాళికా బద్దంగా వెళుతున్న ప్రకాష్ రాజ్ పరిశ్రమలోని పెద్దల మద్దతు కూడగట్టారు. సాయి కుమార్, జయసుధ, శ్రీకాంత్, బ్రహ్మాజీ, బెనర్జీ, బండ్ల గణేష్ లతో పాటు 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ప్రకటించడం జరిగింది. ఇక నాగబాబు తన మద్దతుతో పాటు చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కి ఉన్నాయని బహిరంగంగా చెప్పారు. 


ఇక మంచు విష్ణుకి కృష్ణ ఫ్యామిలీ అండగా నిలుస్తునట్లు సమాచారం. కాగా జీవితా రాజశేఖర్ నందమూరి ఫ్యామిలీ అండ కోరుతున్నారట. అటు నుండి కూడా సానుకూల పవనాలు  వీస్తున్నాయట. తెలంగాణావాదంతో సీవీఎల్ నరసింహారావు గట్టిపోటీదారుగా మారారు. లెక్కకు మించి ప్రత్యర్ధులు పోటీపడనున్న 2021 'మా' అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది రసవత్తరంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios