ప్రస్తుతం సునీల్ టాలీవుడ్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు.. ఒక విలక్షణమైన నటుడు కూడా. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సునీల్ ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు.

ప్రస్తుతం సునీల్ టాలీవుడ్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు.. ఒక విలక్షణమైన నటుడు కూడా. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సునీల్ ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఆ హీరోగా రెండు మూడు విజయాలు దక్కాయి. ఇక సునీల్ హీరో గా స్థిరపడిపోయినట్లే అనుకున్నారు. 

కాయాన్ని ఒక్కసారిగా సునీల్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. వరుస పరాజయాలు సునీల్ మనసు మార్చేలా చేశాయి. ఇప్పుడు హీరో పాత్రలు మాత్రమే కాకుండా.. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. పుష్ప చిత్రంలో మంగళం శ్రీను పాత్ర సునీల్ కి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చింది. 

ప్రస్తుతం దర్శకులు సునీల్ కి విభిన్నమైన పాత్రలు రాస్తున్నారు. తాజాగా సునీల్ మరో రెండు క్రేజీ ఆఫర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నాడట. అలాగే కొరటాల, ఎన్టీఆర్ చిత్రంలో కూడా సునీల్ కి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక పుష్ప 2 ఎలాగూ ఉంది. అలాగే రాంచరణ్, శంకర్ మూవీలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో కూడా సునీల్ నటిస్తున్నాడు. బడా హీరోల చిత్రాల్లో సునీల్ కి ఈ తరహాలో ఆఫర్స్ వస్తుండడంతో మరోసారి సునీల్ కెరీర్ పీక్స్ కి చేరిందని అభిమానులు అంటున్నారు.