Asianet News TeluguAsianet News Telugu

షకీలా అర్హురాలు కాదు, మరోసారి రచ్చ చేసిన రతిక.. హౌస్ లో ఉండను వెళ్ళిపోతాను అంటూ యావర్ కంటతడి 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 రెండవ వారంలో పవర్ అస్త్రాలు పోటీ రసవత్తరంగా జరుగుతోంది. ఆట సందీప్ ఇప్పటికే పవర్ అస్త్ర సాధించి హౌస్ లో మొదటి కంటెస్టెంట్ గా నిలిచాడు.

once again rathika fight with shakeela and house mates dtr
Author
First Published Sep 15, 2023, 10:26 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 రెండవ వారంలో పవర్ అస్త్రాలు పోటీ రసవత్తరంగా జరుగుతోంది. ఆట సందీప్ ఇప్పటికే పవర్ అస్త్ర సాధించి హౌస్ లో మొదటి కంటెస్టెంట్ గా నిలిచాడు. ఇప్పుడు రెండవ పవర్ అస్త్ర సాధించేందుకు పోటీ జరుగుతోంది. రెండవ పవర్ అస్త్ర పోటీకి అర్హులుగా ఎక్కువ అస్త్రాలు భాగాలూ సాధించి శివాజీ, షకీలా నిలిచారు. 

అయితే షకీలా అర్హత విషయంలో రతిక మరోసారి హౌస్ లో నానా రచ్చ చేసింది.స్ షకీలా కంటే ప్రిన్స్ యావర్ జెన్యూన్ గా అర్హుడు అని.. దీని గురించి మాట్లాడితే తనని కార్నర్ చేస్తున్నారు అంటూ రతిక గొడవ పడింది. తనకి అవకాశం దక్కక  యావర్ ఎమోషనల్ అయ్యాడు. కంటతడి పెట్టుకున్నాడు. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనని గేట్లు తెరిస్తే వెళ్ళిపోతాను అంటూ అసహనం వ్యక్తం చేశాడు. 

ఈ క్రమంలో గౌతమ్ కృష్ణ, యావర్ మధ్య పెద్ద గొడవే జరిగింది. షకీలా అర్హురాలు అంటూ గౌతమ్ వాదించాడు. ఆ తర్వాత రతిక వంటగదిలో శుభశ్రీతో గొడవ పడింది. దీనితో శుభశ్రీ ప్రతి చోటా కెమెరాలో హైలైట్ కావడానికి ట్రై చేయొద్దు అంటూ చురకలంటించింది.శుభశ్రీకి షకీలా కూడా మద్దతు తెలిపింది. 

ఇక రెండవ పవర్ అస్త్ర పోటీలో ఆల్రెడీ శివాజీ, షకీలా అర్హత సాధించారు. మూడవ పోటీదారుడిని నేరుగా ఎంచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ సందీప్ కి ఇచ్చారు. దీనితో సందీప్.. అమర్ పేరు చెప్పారు. ఆ విధంగా అమర్ పవర్ అస్త్ర పోటీలో నిలిచాడు. అంటే రెండవ పవర్ అస్త్ర కోసం అమర్, శివాజీ, షకీలా ముగ్గురూ పోటీ పడతారు. 

వీరు ముగ్గురుకి బిగ్ బాస్ పవర్ అస్త్ర పోటీలో ఆసక్తికర టాస్క్ ఇచ్చారు. ఒక పెద్ద చెవి బొమ్మని గార్డెన్ ఏరియాలో ఉంచి.. ఆ చెవిలో ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా బిగ్ బాస్ అని అరవాలి. ఎవరిది పెద్ద గొంతో తేల్చుకోవాలి అని తెలిపాడు. దీనితో శివాజీ, షకీలా, అమర్ ముగ్గురూ ఒకరితర్వాత ఒకరు పలుమార్లు గట్టిగా బిగ్ బాస్ అని అరిచారు. ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలిచారు అనేది వీకెండ్ లో నాగార్జున ప్రకటిస్తారు అంటూ బిగ్ బాస్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios