Asianet News TeluguAsianet News Telugu

ముసలి హీరోల పక్కన నువ్వు ఛండాలంగా ఉన్నావ్

ఆదివారం దిశా పటాని బర్త్ డే నేపథ్యంలో ఆమెకు చిత్ర ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కమల్ ఆర్ ఖాన్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పే క్రమంలో సల్మాన్ ఖాన్ పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. 

once again krk targets salman khan called him buddha ksr
Author
Hyderabad, First Published Jun 14, 2021, 7:51 AM IST


బాలీవుడ్ వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలు, ట్వీట్స్ సంచలనంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో సల్మాన్ ఖాన్ ని ఉద్దేశిస్తూ కమల్ ఆర్ ఖాన్ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోమారు సల్మాన్ ఖాన్ కి మండేలా మరో ట్వీట్ చేశాడు. పరోక్షంగా సల్మాన్ లాంటి ముసలి హీరో పక్కన నువ్వు బాగోలేదని దిశా పటానికి ఉచిత సలహా ఇచ్చాడు. 


ఆదివారం దిశా పటాని బర్త్ డే నేపథ్యంలో ఆమెకు చిత్ర ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కమల్ ఆర్ ఖాన్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పే క్రమంలో సల్మాన్ ఖాన్ పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. డియరెస్ట్ దిశా పటాని నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ముసలి హీరోల పక్కన నువ్వు ఛండాలంగా కనిపిస్తున్నావు. నువ్వు కేవలం టైగర్ కి జంటగా నటిస్తూ బాగుంటుంది.. అంటూ ట్వీట్ చేశాడు. 


సల్మాన్ ఖాన్ దిశా పటాని కాంబినేషన్ లో ఇటీవల రాధే విడుదల కావడం జరిగింది. ఈ సినిమా నెగిటివ్ రివ్యూలు అందుకుంది. కమల్ ఆర్ ఖాన్ రాధే వరస్ట్ మూవీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాధే మూవీని ఉద్దేశిస్తూ సల్మాన్ ఖాన్ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. కమల్ ఆర్ ఖాన్ కి సల్మాన్ ఖాన్ లాయర్స్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios