టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా క్రేజ్ ఉందని మరోసారి ఋజువయ్యింది. బన్నీ సినిమాలు ఏది తెరకెక్కిన హిందీలో డబ్ కావడం కామన్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ జనాలు బన్నీ సినిమాను పిచ్చిగా చూసేస్తారు. 

అసలు విషయంలోకి వస్తే.. గతంలో యూట్యూబ్ లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న సినిమాలుగా నిలిచిన సరైనోడు - డీజే సినిమాలను ఇటీవల రీ అప్లోడ్ చేశారు, గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ ఛానెల్ వారు సినిమాల డబ్బింగ్ రైట్స్ అందుకున్నారు. గతంలోనే ఈ సినిమాలను రిలీజ్ చేసినప్పటికీ ఇటీవల యూ ట్యూబ్ సస్పెండ్ చేయడంతో వ్యూస్ కౌంట్ జీరో అయ్యింది. 

దీంతో మళ్ళీ అప్లోడ్ చేయగా చాలా స్పీడ్ గా ఆ సినిమా నార్త్ జనాలకు దగ్గరైంది. రెండోసారి సరైనోడు 200మిలియన్ల్ వ్యూస్ ని అందుకుంది. అలాగే దువ్వడా జగన్నాథం సినిమాకు 152మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే బన్నీ హవా బాలీవుడ్ ఏరియాలో ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ రెండు సినిమాల తరువాత రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాకు 111మిలియన్ల్ వ్యూస్ ఉన్నాయి.