డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏజెంట్ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈక్రమంలో షూటింగ్ లో ప్రమాదంజరిగి గాయపడ్డాడు సురేందర్ రెడ్డి
ప్రస్తుతం అఖిల్ కు హిట్ ఇవ్వాలని పక్క ప్లాన్ తో ఉన్నాుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏజెంట్ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈక్రమంలో షూటింగ్ లో ప్రమాదంజరిగి గాయపడ్డాడు సురేందర్ రెడ్డి అయినా పని మీద ఉన్న ప్రేమ.. షూటింగ్ కంప్లీట్ అవ్వాలనే తపనతో.. హాస్పిటల్ నుంచి నేరుగా సెట్స్ కు వచ్చేశాడు.
టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సురేందర్ రెడ్డి. యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు . ఆయన డైరెక్ట్ చేసిన రేసుగుర్రం,సైరా లాంటి సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ హీరో ఏజెంట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈసినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అఖిల్ ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయనున్నారు సురేందర్ రెడ్డి.
ఇక ఈ మూవీ షూటింగ్ సందర్భంగా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ ప్లేన్ చేస్తోన్న సమయంలో అనుకోకుండా గాయపడ్డారు సురేందర్ రెడ్డి. ఈ ప్రమాదంలో దర్శకుడి కాలికి తీవ్రంగా గాయమైనట్టు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించగా ట్రీట్ మెంట్ చేసి కాలుకు కట్టుకుూడా కట్టారు. అంతే కాదు నడవలేని స్థితిలో వీల్ చైర్ లో సురేందర్ రెడ్డి కూర్చొని ఉండగా ఆయన కాలుకు పెద్ద కట్టు కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే కాలుకు అంత పెద్ద గాయం అయినా సరే.. హాస్పిటల్ నుంచి సరాసరి షూటింగ్ స్పాట్ కు వచ్చేశాడు సురేందర్ రెడ్డి.పనిపై తనకున్న డెడికేషన్ ను మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సురేందర్ రెడ్డి దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. చివరిగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో పిరియాడికల్ డ్రామా కథతో సైరా నరసింహారెడ్డి తెరకెక్కించి ఆకట్టుకున్నారు.
ఇక ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్ సినిమాతో రాబోతున్నాడు. ఈమూవీలో అఖిల్ 8ప్యాక్ తో మంటలు పుట్టిస్తున్నాడు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా ఈ తెరకెక్కిస్తున్న ఈసిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా మలయాళ స్టార్ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
