ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బర్త్ డే సంబరాల్లో మునిగిపోయి ఉండగా భక్తుడు బండ్ల గణేష్ తన కొత్త మూవీ విడుదల చేశారు. అందరూ తన సినిమా చూడాలంటూ రిక్వెస్ట్ పెట్టారు.

బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ డేగల బాబ్జీ. తమిళ్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ లో పార్తీబన్ నటించారు. రచన, దర్శకత్వం కూడా ఆయనే. కాగా ఈ చిత్రాన్ని చడీ చప్పుడు లేకుండా బండ్ల గణేష్ ఆహాలో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకొని సెప్టెంబర్ 2 నుండి డేగల బాబ్జీ ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశాడు. 

సెప్టెంబర్ 2వ తేదీ దేవర జన్మదినం సందర్భంగా మీ ఇంట్లోకి డేగల బాబ్జీ వస్తున్నాడు. సినిమా చూసి ఆదరించండి. ఇట్లు మీ బండ్ల గణేష్ అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ పరమ భక్తుడిగా బండ్ల గణేష్ ఆయన ఫ్యాన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పవన్ అభిమానుల్లో చాలా మంది బండ్ల గణేష్ పట్ల విశేషమైన అభిమానం కలిగి ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ సెంటిమెంట్ క్యాష్ చేసుకునేందుకు బండ్ల గణేష్ మంచి స్కెచ్ వేశాడు. మరి పవన్ అభిమానులు ఎంత వరకు బండ్ల గణేష్ మూవీ ఆహాలో చూస్తారో చూడాలి. 

Scroll to load tweet…

డేగల బాబ్జీ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడు. కెరీర్ లో మొదటిసారి బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో డేగల బాబ్జీ తెరకెక్కింది. మొదట థియేటర్స్ లో విడుదల చేయాలని భావించారు. కారణం తెలియదు కానీ సైలెంట్ గా ఓటీటీలో విడుదల చేశారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ జల్సా, తమ్ముడు స్పెషల్ షోస్ వీక్షించడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా జల్సా రికార్డు స్థాయిలో ప్రదర్శించడంతో పాటు భారీగా నిధులు సేకరించింది. పోకిరి రికార్డు బద్దలు కొట్టేశారు.