నిర్మాతను దారుణంగా దెబ్బతీసిన ఓం నమో వెంకటేశాయ ప్రొడ్యూసర్ ను తీవ్రంగా నిరాశ పరచిన సినిమా కలెక్షన్లు 25 కోట్ల భారీ నష్టం మిగిల్చిన నాగార్జున, రాఘవేంద్రరావుల భక్తిరస చిత్రం

నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడి గా ప్రధానపాత్రలో నటించిన చిత్రం '' ఓం నమో వెంకటేశాయ ''. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ చిత్రానికి అన్ని వర్గాల్లో పాజిటివ్ టాక్ వినిపించినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచాయి. సినిమా రిలీజ్ అయి 19 రోజులు అవుతున్నప్పటికీ 17 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన షేర్ కేవలం 8 కోట్ల రూపాయలే. 35 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ఇప్పటి వరకు పది కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే పెట్టుబడి రావటానికి మరో పాతిక కోట్లు రాబట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా చాలా కష్టంగా కనిపిస్తోంది.

ఓవరాల్ గా పాపం ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మహేష్ రెడ్డికి ఈ మూవీ భారీగా నష్టాలను మిగిల్చింది. అంతకుముందు నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లోనే.. షిర్డీ సాయి చిత్రాన్ని కూడా నిర్మించాడు మహేష్ రెడ్డి. కష్టం కలిగితే అంతా దేవుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటాం. కానీ భక్తికథా చిత్రాలను నిర్మించి ఆ దేవుళ్ల కోసమే అంకితమిచ్చినా ఇలా నష్టాలను తెచ్చిపెట్టడంతో నిర్మాత తీవ్రంగా నిరాశపడుతున్నారు.