నమ్రతపై మహేష్‌బాబుకి కంప్లైంట్‌ చేశారు నిర్మాత ఎంఎస్‌ రాజు. నమ్రత చేసిన పోస్ట్ తనని బాధించిందని వెల్లడించారు. అయితే తాను హ్యాపీగానే ఉన్నానన్నారు. ఇంతకి నమ్రతపై నిర్మాత ఎం.ఎస్‌.రాజు.. మహేష్‌కి ఎందుకు ఫిర్యాదు చేశాడనేది తెలుసుకుంటే. మహేష్‌ బాబు, భూమిక జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ `ఒక్కడు` విడుదలై శుక్రవారానికి 18ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దీన్ని గుర్తు చేసుకుంటూ విషెస్‌ తెలియజేశారు. 

ఈ సందర్భంగా నమ్రత ఈ సినిమాపై ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. `మహేష్‌ నటించిన సినిమాల్లో `ఒక్కడు` క్లాసిక్‌ హిట్‌. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. `ఒక్కడు` నా ఆల్‌టైమ్‌ ఫేవరేజ్‌` అని పేర్కొంటూ, మహేష్‌,  భూమిక, దర్శకుడు గుణశేఖర్‌, ప్రకాష్‌ రాజ్‌, ఫైట్‌ మాస్టర్‌ విజయన్‌, సంగీత దర్శకుడు మణిశర్మ పేర్లని మెన్షన్‌ చేసింది. ఇందులో నిర్మాత ఎం.ఎస్‌. రాజు పేరుని మర్చిపోయింది. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. 

ఇది చూసిన నిర్మాత ఎంఎస్‌. రాజు హర్ట్ అయ్యారు. తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో నమ్రతపై మహేష్‌కి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో మహేష్‌ని కోట్‌ చేస్తూ, `పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమత్రగారు `ఒక్కడు` సినిమా గురించి మాట్లాడుతూ, నా పేరుని మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకి ఫేవరేజ్‌ చిత్రం కావడం. గుడ్‌లక్‌` అని పేర్కొన్నారు. దీనిపై ఈ సినిమా అభిమానులు, ఎంఎస్‌ రాజు ఫ్యాన్స్ స్పందిస్తూ, మీరు లేకపోతే సినిమా లేదని, గొప్ప సినిమాని అందించినందుకు కృతజ్ఞతలు అంటూ ఆయనకు మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారు. మరి దీనిపై మహేష్‌ స్పందిస్తారా? నమ్రత తన తప్పుని సరిదిద్దుకుంటుందా? అన్నది చూడాలి.