Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ తో రియలిజం ఫాంటసీ, ఐదేళ్లయినా వెయిట్ చేస్తా.. ఒకే ఒక జీవితం డైరెక్టర్

యువ దర్శకుడు శ్రీకార్తిక్ ఇటీవల విడుదలైన ఒకే ఒక జీవితం చిత్రంతో సత్తా చాటాడు. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 

Oke Oka Jeevitham Director Srikarthik interesting comments on Allu Arjun
Author
First Published Sep 13, 2022, 2:15 PM IST

యువ దర్శకుడు శ్రీకార్తిక్ ఇటీవల విడుదలైన ఒకే ఒక జీవితం చిత్రంతో సత్తా చాటాడు. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. టైం ట్రావెల్ కథని, అమ్మ సెంటిమెంట్ ని శ్రీకార్తిక్ అద్భుతంగా మిక్స్ చేశాడు. 

ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలతో నవ్విస్తూ, టైం ట్రావెల్ తో థ్రిల్ చేస్తూ.. మదర్ సెంటిమెంట్ తో కంటతడి కూడా పెట్టించారు. దీనితో ఒకే ఒక జీవితం చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. 

తొలి చిత్రమే మంచి విజయం సాధించడంతో శ్రీకార్తిక్ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ యువ దర్శకుడి ఫ్యూచర్ ప్లాన్ భారీగానే ఉన్నాయి. స్టార్ హీరోలతో లార్జర్ దాన్ లైఫ్ చిత్రాలని తెరకెక్కించాలని శ్రీకార్తిక్ కలలు కంటున్నాడు. 

తాజాగా ఇంటర్వ్యూలో శ్రీకార్తిక్ తన ఫ్యూచర్ ప్లాన్స్ బయట పెట్టాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకుని రియలిజం ఫాంటసీ నేపథ్యంలో అద్భుతమైన కథ రెడీ చేసినట్లు శ్రీ కార్తీక్ తెలిపారు. బన్నీతో ఈ చిత్రం చేయడానికి ఐదేళ్లు వెయిట్ చేసేందుకు కూడా తాను సిద్ధం అని శ్రీకార్తిక్ తెలిపాడు. అతడి కాన్ఫిడెన్స్ దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మరో ఏడాది వరకు బన్నీ కొత్త ప్రాజెక్టు చేసే అవకాశం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ శ్రీకార్తిక్ కథ వింటాడా ? అతడికి ఛాన్స్ ఇస్తాడా అనేది ఆసక్తిగా మారింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios