Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ కాదన్నాడు, విశ్వక్ సేన్ ఎస్‌ చెప్పా డు?

కొద్ది రోజుల క్రితం అఖిల్ ని పీవీపి నిర్మాణ సంస్ద వారు ఓ రీమేక్ సినిమాతో ఎప్రోచ్ అయ్యారు. అయితే అఖిల్ ఆ సినిమాని చూసి వెంటనే నో చెప్పేసారట. అయితే అదే వయస్సులో ఉండే మరో హీరో తో చెయ్యాలి,అదీ వెంటనే డేట్స్ ఇచ్చేవాడైతే బెస్ట్ అని విశ్వక్ సేన్ ఎప్రోచ్ అయితే యస్ చెప్పాడంటున్నారు.

Oh My Kadavule remake Rejected by Akhil
Author
Hyderabad, First Published Jun 13, 2020, 9:45 AM IST

ఓ హీరోతో అనుకుని రెడీ చేసుకున్న స్క్రిప్టు  ఆ తర్వాత కాలంలో వేరే హీరోతో తెరకెక్కటం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత కాలంలో ఆ సినిమా సూపర్ హిట్ అయితే సదరు మొదట ఎప్రోచ్ అయిన హీరో నాలుక కరుచుకోవటం కూడా గమనిస్తున్నాం. ఇప్పుడు అలాంటిదే అఖిల్ విషయంలో జరగబోతోందా...కొద్ది రోజుల క్రితం అఖిల్ ని పీవీపి నిర్మాణ సంస్ద వారు ఓ రీమేక్ సినిమాతో ఎప్రోచ్ అయ్యారు. అయితే అఖిల్ ఆ సినిమాని చూసి వెంటనే నో చెప్పేసారట. అయితే అదే వయస్సులో ఉండే మరో హీరో తో చెయ్యాలి,అదీ వెంటనే డేట్స్ ఇచ్చేవాడైతే బెస్ట్ అని విశ్వక్ సేన్ ఎప్రోచ్ అయితే యస్ చెప్పాడంటున్నారు. ఇంతకీ ఏమిటా సినిమా...

ఆ మధ్యన తమిళంలో  ఓ మై క‌డ‌వులే అనే  సినిమా వచ్చి హిట్టైంది. ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను పీవిపివారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో విడాకుల తీసుకుందామనుకుంటున్న జంటకు భగవంతుడు వచ్చి వారి సమస్యలు తీర్చటం అనే అంశంపై ఆధారపడి చేసిన రొమాంటిక్ కామెడీ. విజయ్ సేతుపతి ఈ సినిమాలో దేవుడుగా కనిపిస్తారు. ఆయన విడిపోయే ఆ జంటకు..తిరిగి ట్రామ్ ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లి తమ సమస్యలు తీర్చుకునే అవకాసం ఇస్తాడు. ఫన్ తో నడిచే ఈ కామెడీ అఖిల్ కు సెట్ అవుతుందని నిర్మాతలు పీవిపి వారు భావించారట. అయితే అఖిల్ తనకు అలాంటివి నచ్చవు అని చెప్పటండో విశ్వక్ సేన్ సీన్ లోకి వచ్చారట.

దానికి తోడు విశ్వ‌క్ సేన్ అయితే త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమా పూర్తి చేయొచ్చ‌ని భావించిన పీవీపీ..ఈ సినిమా విష‌య‌మై చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్న‌ట్లుగా టాక్.  ఈ న‌గ‌రానికి ఏమైంది, ఫ‌ల‌క్‌నుమా దాస్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు యువ న‌టుడు విశ్వ‌క్ సేన్. ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ హిట్ సినిమా మిక్సె డ్ టాక్ తెచ్చుకుంది. విశ్వ‌క్ సేన్ న‌టించ‌నున్న కొత్త సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios