చెప్పినట్టుగానే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని పక్కనపెట్టి ఇప్పుడు సమంత సరికొత్త కథల్ని ఎంచుకుంటోంది. సినిమాలో కంటెంట్ ఉంటే స్టార్ డమ్ ని సైతం పక్కనపెట్టేసి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తోంది. ఓ బేబీ సినిమాతో అమ్మడు మరోసారి తానేంటో నిరూపించుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాను ఓవర్సీస్ లో కూడా భారీగానే రిలీజ్ చేశారు. ఇక యూఎస్ ప్రీమియర్ షో టాక్ పై ఓ లుక్కేద్దాం. 

అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ద్వారా లక్ష్మి అనే వృద్ధురాలు యువతిగా మారిపోతుంది. అనంతరం ప్రపంచంలో ప్రస్తుత యువతికి ఎదురయ్యే అనుభవాలను యంగ్ గా మరీన సమంత ఫెస్ చేస్తుంది. ఈ క్రమంలో ఫ్రెండ్, కొడుకు అలాగే మనవడితో జరిగే ప్రయాణాలు ఊహించని విధంగా ఆశ్చర్యనికి గురి చేస్తాయి. 

ఇక సమంత వెంటపడే నాగ శౌర్య పాత్ర కూడా సినిమాలో మరో మేజర్ ప్లస్ పాయింట్. ఫ్లాష్ బ్యాక్ లో కూడా సమంత పాత్ర సరికొత్తగా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో సమంత సీన్ కి తగ్గట్టు సరికొత్త అవతారం ఎత్తిందనే చెప్పవచ్చు. దర్శకురాలు నందిని రెడ్డి ఈ సెన్సిటీవ్ స్టోరీని చాలా బాగా డీల్ చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి. 

ఇక కామెడీ సీన్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. పాటలు సినిమాకు అంతగా ఉపయోగపడలేదు గాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉంది. సెట్స్ కూడా సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీల్ ను కలిగిస్తాయి. సినిమా అక్కడక్కడా స్లో అనిపించినా సమంత తన పాత్రతో బూస్ట్ ఇస్తుంది. ఫైనల్ గా ప్రవాసుల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. మరి లోకల్ ఆడియెన్స్ ని ఓ బేబీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.