ఈ విషయం చెప్పడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నా.. ప్రభాస్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 6, Sep 2018, 11:17 AM IST
official announcement on prabhas' next film
Highlights

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ హీరోగా ఎదిగాడు. అతడి మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది. 

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ హీరోగా ఎదిగాడు. అతడి మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమాలను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.

బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే తన తదుపరి సినిమా విశేషాలను వెల్లడించాడు ప్రభాస్. సోషల్ మీడియా వేదికగా తన నెక్స్ట్ సినిమా ఎవరితోననే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.

''నా నెక్స్ట్ సినిమా త్రైలింగ్వల్ ఫిలిం లాంచ్ కాబోతుంది. ఈ విషయం చెప్పడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నా.. కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో.. గోపి మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజాహెగ్డేతో హీరోయిన్ గా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది'' అంటూ వెల్లడించాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన బరువుని తగ్గించే పనిలో పడ్డాడట. రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. 

 

loader