మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా వాయిదా పడుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ లో సినిమా వచ్చే ఛాన్స్ లేదని, జూన్ కి వెళ్లేలా ఉందని అన్నారు. అయితే ఈ వార్తలు తెలుసుకున్న మహేష్ బాబు అప్సెట్ అయినట్లు సమాచారం. 

'మహర్షి' వాయదా అంటూ వరుసగా కథనాలు రావడంపై మహేష్ నిర్మాతలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సిందేనని కండీషన్ పెట్టాడట. 

మీడియాకి కూడా అప్డేట్ ఇవ్వాలని చెప్పడంతో ఇక దిల్ రాజు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. మార్చి 15నాటికి 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ప్రకటిస్తూ.. ఏప్రిల్ 25న సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తామని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

దీంతో 'మహర్షి' విడుదల వాయిదాపై వస్తోన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.