రానా ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ భారీ పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప' తెరకెక్కించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన రాకపోవడంతో అసలు ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనే సందేహాలు కలిగాయి.

ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ తన సోషల్ మీడియా పేజీలో ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలిపారు.

ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషిస్తున్నాడని, సినిమాకు  సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రానా తన సొంత బ్యానర్ లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.