విజయ్‌ దేవరకొండపై గత కొన్ని రోజులుగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో అసభ్యకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్‌లో విజయ్‌కి సంబంధించి గౌరవాన్ని దెబ్బతీసేలా, పరువు నష్టం కలిగేలా ఆయన వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగారు. అతన్ని ఎట్టకేలకు పట్టుకుని అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరి వివరాల్లోకి వెళితే.. 

విజయ్‌ దేవరకొండ హీరోగా విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకు ఇండియా వైడ్‌గా ఫాలోయింగ్‌ ఏర్పడింది. రౌడీ బాయ్‌గా ఆయన్ని అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇటీవల `ఖుషి`తో హిట్‌ అందుకున్న విజయ్‌ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో `ఫ్యామిలీ స్టార్‌` చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే అనంతరపురానికి చెందిన వెంకట కిరణ్‌.. సినీ పోలిస్‌ అనే యూట్యూబ్‌లో ఛానెల్‌లో తరచూ విజయ్‌ దేవరకొండపై అసభ్యకరమైన వార్తలు ప్రసారం అవుతున్నాయి. కొన్ని రోజులుగా ఆయన సినిమాలకు సంబంధించిన అసభ్యకరమైన వార్తలను ప్రసారం చేశారు. అలాగే అయన్ని, ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానిస్తూ వీడియోలు చేశారు. 

దీంతో ఈ విషయం విజయ్‌ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు వెంకట కిరణ్‌ ఆచూకి కనిపెట్టింది. 2590/2023 గా కేసును ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు టార్గెటెడ్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడం గమనార్హం.