జులై 21 ఆదివారం నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతోంది. ఈ షోలో పాల్గొనబోయే సెలెబ్రిటీలు ఎవరు.. ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది. బిగ్ బాస్ లో పాల్గొనబోయే సెలెబ్రిటీల గురించి ఇప్పటివరకు అనేక ఊహాగానాలు వినిపించాయి. 

తాజాగా బిగ్ బాస్ 2 సెలెబ్రిటీ నూతన్ నాయుడు పోస్ట్ చేఇస్నా ఓ వీడియో ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనబోయే సభ్యులు వీళ్ళే అంటూ ప్రకటించాడు. తాను 100 శాతం ఖచ్చితంగా చెబుతున్నానని రేపటి షోలో పాల్గొనబోయేది వీళ్ళే అని నూతన్ నాయుడు చెబుతున్నాడు. 

నూతన్ నాయుడు ప్రకటించిన లిస్టులో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(దంపతులు), టీవీ ఆర్టిస్ట్ రవికృష్ణ, అలీ రెజా, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌ స్మాష్ స్టార్ అశు రెడ్డి ఉన్నారు. 

మరో ఆసక్తికర అంశం ఏంటంటే నూతన నాయుడు ప్రకటించిన లిస్టులో టివి 9 ముఖాముఖీ కార్యక్రమంతో పాపులర్ అయిన జాఫర్ కూడా ఉన్నాడు. ఈ విషయం తనకు ఎలా తెలిసింది అనే సంగతినిమాత్రం నూతన్ నాయుడు చెప్పలేదు. ఇందులో వాస్తవం ఎంతుందో ఆదివారం రోజు తేలనుంది.