బిగ్ బాస్ 2 స్టార్ట్ అవ్వకముందు ఎవరో తెలియని నూతన్ నాయుడు ఒక్కసారిగా ఆ రియాలిటీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో మనోడు బాగానే  ప్రమోట్ అయ్యాడు. అయితే ఇప్పుడు నటనపరంగా అడుగులు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.ఇప్పటికే 14 సినిమాల వరకు ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 

సినిమాలతో పాటు 3 మెగా సీరియల్స్ కూడా చేస్తున్నాడంట. ఇన్ని ఆఫర్స్ వస్తుంటే మనోడికి పారితోషికం కూడా గట్టిగానే అందుతుందని అనుకోవడంలో తప్పు లేదు. కానీ అతను ఒక్క రూపాయ్ కూడా తీసుకోవడం లేదట. నిర్మాతలదగ్గరనుంచి అలాగే దర్శకుల దగ్గరనుంచి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని చెబుతున్నాడు. పైగా తన ఖర్చులన్నీ సొంతంగా తన జేబులోనుంచే పెట్టుకుంటున్నాడట. 

అసిస్టెంట్ ఫీజు నుంచి ట్రావెలింగ్ చార్జెస్ తో పాటు బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా తనకు తానే ఖర్చు చేసుకుంటున్నట్లు చెబుతుండడం విశేషం.  బిగ్ బాస్ లో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా రెండుసార్లు వెళ్లొచ్చిన ఈ ఎనర్జిటిక్ మ్యాన్ ఇప్పుడు సినిమాలకు సీరియల్స్ కి కూడా అదే తరహాలో సింగిల్ పైసా కూడా తీసుకోకపోవడం గమనార్హం. 

అవకాశాలు ఇచ్చే నిర్మాతల దగ్గరనుంచి డబ్బు తీసుకొని ఆర్డీకభారం కలిగించడం ఇష్టం లేక నూతన్ నాయుడు ఈ విధంగా నడుచుకుంటున్నాడట.  ఇలా నిర్మాతలకు డబ్బు సేవ్ చేస్తా అంటే ఎవరు మాత్రం వద్దనగలరు. నూతన్ నాయుడు కమిట్మెంట్ కి మరిన్ని ఆఫర్స్ వచ్చినా కూడా షాకవ్వాల్సిన అవసరం లేదు.