.. మధ్యప్రదేశ్‌లోని ఒక అమ్మాయి తన పట్టణంలో కండోమ్‌లు అమ్మే పనిని చేపట్టడం..తదనంతర పరిణామాల చుట్టూ జరుగుతుంది. ఆడపిల్లలు, కండోమ్స్ అమ్మకం అనగానే సమాజంలో ఓ రకంగా చూస్తుంది. 


నుస్రత్ బరూచా…మనవాళ్లకు ఇంకా పెద్దగా పరిచయం కాలేదు కానీ. ఈ బాలీవుడ్ బ్యూటీ త్వరలో బాలీవుడ్ టాప్ లీడింగ్ లేడీస్ లిస్టులోకి చేరేస్తుందంటున్నారు. తనదైన స్థాయిలో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఒక్కో మెట్టు ఎక్కేస్తోంది బబ్లీ బరూచా! తాజాగా ఆమె జన్ హిత్ మే జారీ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె తన టౌన్ లో కండోమ్‌లు అమ్మే అమ్మాయి గా కనిపించనుంది.

జై బసంతు సింగ్ దర్శకత్వం వహించిన సోషల్ డ్రామా మూవి... మధ్యప్రదేశ్‌లోని ఒక అమ్మాయి తన పట్టణంలో కండోమ్‌లు అమ్మే పనిని చేపట్టడం..తదనంతర పరిణామాల చుట్టూ జరుగుతుంది. ఆడపిల్లలు, కండోమ్స్ అమ్మకం అనగానే సమాజంలో ఓ రకంగా చూస్తుంది. వాటి నుంచి పుట్టే సమస్యలను తనదైన శైలిలో ఎదుర్కొనే కథ ఇది. అయితే ఆమె తన కుటుంబం మరియు సొసైటీపై పోరాడుతుంది.

View post on Instagram

జన్ హిత్ మే జారీ కోసం నుష్రత్ మరోసారి డ్రీమ్ గర్ల్ రచయిత రాజ్ శాండిల్యతో కలిసి పనిచేశారు. ఫన్ ప్రధానంగా..ఓ సోషల్ మెసేజ్ బేస్ చేసుకుని కథ నడుస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ రేపు అంటే మే 6న రిలీజ్ కానుంది. చూడాలి ఆమె లిటిల్ అంబరెల్లా కండోమ్స్ అమ్ముతుందో. 

ఇక 2020 ఇండస్ట్రీలోని చాలా మంది సక్సెస్ ఫుల్ బ్యూటీస్ కి ఖాళీగానే గడిచిపోయింది. కానీ, నుస్రత్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘అజీబ్ దాస్తాన్స్’తో మంచి విజయం ఖాతాలో వేసుకుంది. పర్ఫామెన్స్ కి స్కొప్ ఉన్న క్యారెక్టర్ తో యాంథాలజీ సిరీస్ లో సత్తా చాటింది. అయితే, ఇంకా థియేటర్లు తెరుచుకోక చాలా మంది బాలీవుడ్ సెలబ్స్ ఇంట్లో కూర్చుని ఉన్న 2021లోనూ నుస్రత్ బేబీ దూకుడు తగ్గించటం లేదు. ఈసారి యూట్యూబ్ లో దుమారం రేపింది. పాప్ సింగర్ హనీ సింగ్ తో కలసి పాప తొలి సింగిల్ జనంలోకి వదిలింది! ‘సయ్యా జీ’ పాటతో తన సయ్యాటలు చూపి మాయ చేసింది.

View post on Instagram

హనీ సింగ్ తో కలసి ‘సయ్యా జీ’ అంటూ సరసాలు ఆడింది. యూట్యూబ్ లో ఏకంగా 400 మిలియన్లు దాటిపోయింది వ్యూస్ సంఖ్య. ఈ సందర్భంగా నుస్రత్ బరూచా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సినిమాల కంటే సింగిల్స్ చాలా భిన్నమని అభిప్రాయపడింది. వీడియో ఆల్బమ్ సాంగ్స్ కి షూట్ చేయటం గొప్ప అనుభూతి అంటోంది.
ఇప్పుడిప్పుడే డిమాండ్ పెంచుకుంటోన్న నుస్రత్ బరూచా ‘చోరీ, హర్దంగ్, జన్ హిత్ మే జారీ, రామ్ సేతు’ లాంటి ఇంట్రస్టింగ్ మూవీస్ చేస్తోంది. చూడాలి మరి, రానున్న రోజుల్లో ఈ టాలెంటెడ్ బ్యూటీ ఎలాంటి రేంజ్ కి ఎదుగుతుందో!