ఎన్టీఆర్ కి లుక్ టెస్ట్,ట్రైల్
ఎన్టీఆర్ సైతం రంగంలోకి దూకారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఈ వారం నుంచి పాల్గొంటున్నారు. అదే సమయంలో ఆయన తన టీవి షో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కు లుక్ ట్రైల్ లో పాల్గొంటున్నారని సమాచారం.
కరోనా కంట్రోలులోకి రావటంతో మళ్లీ సినిమావాళ్లు బిజీ అవుతున్నారు. టీవి వాళ్లు హడావిడి పెంచేసారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సైతం రంగంలోకి దూకారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఈ వారం నుంచి పాల్గొంటున్నారు. అదే సమయంలో ఆయన తన టీవి షో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కు లుక్ ట్రైల్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ లుక్ ట్రైల్ రేపటి కూడా ఉంటుందని,పూర్తవుతుందని సమాచారం. వాస్తవానికి ఇప్పటికే ఈ షో ప్రారంభం కావాలి కానీ కరోనాతో ఆగిపోయింది. ఎన్టీఆర్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో తన పోర్షన్ ని జూలై ఆఖరకు పూర్తి చేసి, ఆగస్ట్ నుంచి షోలో పాల్గొనాలి అని భావిస్తున్నారు.అలాగే #NTR30 కూడా ఆగస్ట్ లోనే ప్రారంభం అయ్యే అవకాసం ఉంది.
ఇక రెండు నెలల క్రితం 'రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ పిలిచాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జెమినీ టీవీ ప్రొడ్యూస్ చేసే ఈ షోకు ఒక్కసారిగా క్రేజ్ ఏర్పడింది. ఆ ఉత్సాహంలో వచ్చే నెల నుంచి టెలికాస్ట్ ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈ షోకు సంభందించి ప్రోమోని వదిలారు. ఇప్పుడు వాయిదాపడి ఆపేసారు. కరోనా దెబ్బతో అంతా కలలోగ జరిగిపోయింది.
ఇక ఇంతకు ముందు సైతం ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో మరోసారి అలరించడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఇందులో ఆయన కొత్త గెటప్‌లో కనపడుతున్నాడు.ఇక్కడ మీరు ఏం గెలుచుకున్నా గెలుచుకోకపోయినా.. జీవితంలో ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ ను మాత్రం మీకు వచ్చేలా చేస్తా అంటూ ప్రామిస్ చేయడం ప్రోగ్రాం కే హైలైట్ గా నిలిచింది.