ఎన్టీఆర్ బర్త్ డే నాడు కొన్ని ఆసక్తికర అప్డేట్స్ మాత్రం రానున్నాయి. వాటిలో మొదటిగా ఆర్ ఆర్ ఆర్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఇది. ఆయన బర్త్ డే గిఫ్ట్ సిద్ధం చేసింది ఆర్ ఆర్ ఆర్ టీమ్. అధికారిక ప్రకటన కూడా జరిగిపోగా ఫ్యాన్స్ పండగలా ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ రేపు తన 38వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బర్త్ డే వేడుకలు షురూ చేశారు ఆయన ఫ్యాన్స్. అయితే భౌతికమైన వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉంటూ కరోనా నిబంధనలు పాటించడమే ఫ్యాన్స్ గా మీరిచ్చే అతిపెద్ద బహుమానం అని ఆయన లిఖితపూర్వక లేఖ ద్వారా విన్నవించారు.
అయితే ఎన్టీఆర్ బర్త్ డే నాడు కొన్ని ఆసక్తికర అప్డేట్స్ మాత్రం రానున్నాయి. వాటిలో మొదటిగా ఆర్ ఆర్ ఆర్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం 10:00 గంటలకు ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంటెన్స్ లుక్ విడుదల చేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. దీనితో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా చేస్తున్న చరణ్ బర్త్ డే నాడు అల్లూరి సీతారామరాజుగా ఆయన లుక్ విడుదల చేయగా భారీ ఆదరణ దక్కింది.
అదే తరహాలో రేపు ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ తో కూడిన పోస్టర్ విడుదల చేస్తున్నారు రాజమౌళి. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది. నిరవధికంగా సాగుతున్న షూటింగ్ కి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కాగా రేపు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై కూడా అధికారిక ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
