భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఎన్టీఆర్  కి సంబంధించిన ప్రతి విషయం సంచలనమే. ఈ స్టార్ హీరో సినిమా అప్డేట్స్ తో పాటు, వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతుంటాయి. ఎన్టీఆర్ వాచ్ ధర, మాస్క్, షూస్ ఇలా చాలా విషయాలు ప్రత్యేకంగా నిలిచాయి. తాజాగా ఎన్టీఆర్ బుల్లితెర షో కోసం ధరించిన బ్లేజర్ ధర హాట్ టాపిక్ గా మారింది. జెమినీ టెలివిజన్ లో ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగామ్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

 
ఈ షో ప్రోమోలు ఇప్పటికే విడుదల కావడంతో పాటు, ఆదరణ దక్కించుకున్నాయి. గతంలో బిగ్ బాస్ రియాలిటీ షోని ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా నడిపారు. ఆయన హోస్టింగ్ స్కిల్స్ కి మంచి మార్కులు పడ్డాయి. దీనితో ఎవరు మీలో కోటీశ్వరుడు సైతం భారీ టీఆర్పీ దక్కించుకోవడం ఖాయమని, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


కాగా ఈ షో ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ బ్లాక్ కలర్ బ్లేజర్ లో కనిపించారు. సూట్ లో ఎన్టీఆర్ జెంటిల్ లుక్ అదిరిపోయింది. కాగా ఎన్టీఆర్ ధరించిన ఆ సూట్ ధర అక్షరాలా రూ. 99 వేలు అట. ప్రముఖ సెలెబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా... ఆ కోటు డిజైన్ చేశారట. ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు సీజన్ మొత్తానికి అవసరమైన ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ మనీష్ మల్హోత్రానే రూపొందిస్తున్నట్లు సమాచారం. 


ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది . ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో చేయాల్సిన మూవీ పరిస్థితి ఏమిటన్న సందిగ్ధం పరిశ్రమ వర్గాలలో ఏర్పడింది.