బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ విషెస్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక విడుదల దగ్గరైన సందర్భంగా బాలయ్యకు ప్రత్యేకమైన సినిమా కావడంతో స్టార్స్ అంతా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. ఇక నందమూరి వంశ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
బాబాయ్‌కి, గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్‌కు, దర్శకుడు క్రిష్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రక సినిమాలో తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరైన శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ నటించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటించారు.
