ఫిల్మ్ సెలబ్రెటీలు.. అందులోను స్టార్ హీరోలు కాస్ట్లీ వస్తువులు వాడటం కొత్తేం కాదు.. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ రేటు ఔరా అనిపిస్తుంది.

ఒక్క వాచ్ అమ్మితే చాలు మీ బ్యాచ్ సెటిల్ అయిపోతుంది.. ఇది త్రివిక్రమ్(Trivikram) డైరెక్ట్ చేసిన అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్. అంటే ఆ సినిమాలో పవర్ స్టార్ (Power Star) వాచ్ ఎంత ఖరీదో అంకెల్లో కూడా చెప్పకుండా సింబాలిక్ గా చెప్పించాడు త్రివిక్రమ్. మాటల మాత్రికుడు ఊరికే ఈ డైలాగ్ రాయలే.. ప్రస్తుతం మన సెలబ్రెటీలను.. వారి కాస్ట్లీ లైఫ్ స్టైల్ ను చూసే రాసినట్టున్నాడు. ఇంతకీ ఇప్పుడు మ్యాటర్ ఏంటీ అంటే.. ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఆ వాచ్ కాస్ట్ గురించి తెలిసి ఔరా.. అవునా.. నిజమా.. అంటున్నారు జనాలు.

త్రివిక్రమ్ పవర్ స్టార్ కోసం ఆడైలాగ్ రాశారు కాని.. నిజానికి ఎన్టీఆర్(Ntr) కోసం రాయాల్సింది. ఎందకుంటే.. ఇక్కడ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ తో.. ఓ పదిమంది పైనే మిడిల్ క్లాస్ బ్యాచ్ ఫుల్ గా సెటిల్ అవ్వచ్చు. ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చూసి.. ఇదేదో బాగుందే.. ఎంత కాస్ట్ అవుతుందబ్బా అని అనుకుంటూ.. ఆన్ లైన్ లో ఆ వాచ్ కాస్ట్ ను సెర్చ్ చేశారు కొంతమంది. ఆ వాచ్ కాస్ట్ చూసి.. బొమ్మ కనిపించింది వారికి. ఆ వాచ్ రేటు అక్షరాలా నాలుగు కోట్లు. నాలుగు కోట్ల వాచ్ ఏంటీ బ్రో అని అనిపింస్తుంది కదా.. అవును Richard Mille rm 011 CarbonNtpt Grosjean Rose Gold lotus F1 Team limited Edition వాచ్ ఖరీదు ఆన్ లైన్ లో 3కోట్ల 99 లక్షల32 వేల 392 రూపాయాలు చూపిస్తుంది.

Also Read: RRR: ఆ భాష ఒక్కటే ఇబ్బంది పెట్టింది... కూనీ చేస్తున్నామేమో అనిపించిందన్న తారక్...

నిజానికి సెలబ్రెటీలు.. అందులోను ఫిల్మ్ సెలబ్రెటీలు.. అందులోను మన టాలీవుడ్ సెలబ్రెటిలది లగ్జరీ లైఫ్. ఏదో ఒక కాస్ట్లీ వస్తువు కొని అప్పుడప్పుడు వార్తల్లో ఉంటుంటారు మనవాళు. అందులో ఎన్టీఆర్ అయితే ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటాడు. ఎందుకంటే అంతకు ముందు తారక్ ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ చాలా కొన్నాడు. రాజమౌళి కొడుకు పెళ్లికి జైపూర్ వెళ్లినప్పుడు కూడా కాస్ట్లీ వాచ్ పెట్టుకుని హాట్ టాపిక్ అయ్యారు Ntr. అప్పట్లో ... రెండున్నర కోట్ల విలువ చేసే Richard Mille RM 11-03 McLaren automatic flyback chronograph watch ను పెట్టుకుని కనిపించారు.

లగ్జరీ, కాస్ట్లీ ఐటమ్స్ ను ఎన్టీఆర్ ఎక్కువగా కొంటుంటారు. ఆమధ్య తనకు ఇష్టమైన Lamborghini Urus Graphite Capsule కార్ ను ఇష్టపడి బుక్ చేసుకున్నారు. ఇండియాలో ఫస్ట్ బుకింగ్ తారక్ దే. ఈ కారు ఖరీదు దాదాపు మూడున్నర కోట్లు. టాక్స్ లతో కలుపుకుని భారీగానే ఖర్చు చేసి తనకిస్టమైన కారును సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇలా తారక్ ప్రతీ సారి కాస్ట్లీ వాచ్ లతో.. కార్లతో.. ఆడియన్స్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తనే ఉన్నాడు.