Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్


విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 12వ చిత్రం. 

NTR voice over for Vijay Deverakonda? jsp
Author
First Published Aug 24, 2024, 12:18 PM IST | Last Updated Aug 24, 2024, 12:18 PM IST


ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వటం కామన్. అలా విజయ్ దేవరకొండ సినిమాకు ఎన్టీయార్ వాయిస్ ఓవర్ అందించబోతున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్నాడు. అలా మరోసారి తన వాయిస్ ని మరోసారి ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ తో ప్రత్యేతక ఏమిటంటే...ఇప్పుడు వున్న హీరోల్లో గంభీరమైన గొంతు ఎవరికి వుంది అంటే ఎన్టీఆర్, ప్రభాస్ లకే అనేది నిజం. కాబట్టి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఓ లెక్కలో వుంటుందనేది నిజం. అందుకే తమ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ ను ఎంచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి ఎన్టీయార్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వాయిస్‌తోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. వాయిస్ ఓవ‌ర్ కోసం ప‌లువురు స్టార్ హీరోల‌ను అనుకున్న సినిమా యూనిట్ చివ‌ర‌కు ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి కాంబోలో ఈ  సినిమా రాబోతోంది. విజ‌య్ గ‌త సినిమాల‌కు భిన్నంగా స్పై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కంప్లీట్ మాస్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌లో షార్ట్ హెయిర్ క‌ట్‌, గ‌డ్డంతో క‌నిపించాడు. వీడీ 12 మూవీని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.  సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. 

ఈ నిర్మాణ సంస్థ‌లో గ‌తంలో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా చేశాడు ఎన్టీఆర్‌. ఈ బ్యాన‌ర్‌లో వ‌చ్చి టిల్లు స్క్వేర్ ప్ర‌మోష‌న్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దేవ‌ర‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేయ‌బోతున్న‌ది. ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్‌తోనే వాయిస్ ఓవ‌ర్‌ను చెప్పించాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇక వీడీ 12 మూవీ 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇటీవ‌లే నిర్మాణ సంస్థ అఫీషియ‌ల్‌గా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. 

అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్ (Girish Gangadharan), జోమోన్ టి జాన్ (Jomon T John)కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌గా. శ్రీకర స్టూడియోస్ (Srikara Studios) ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 80 శాతం వ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో వీడీ 12 మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios