నటుడుగా బిజీగా ఉంటూనే మరో ప్రక్క పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిస్తున్నారు ఎన్టీఆర్.  నవరత్న ఆయిల్ నుండి ఐపిఎల్ వరకు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన తారక్ ఇప్పుడు ' అప్పిఫిజ్ అనే డ్రింక్ కు అంబాసిడర్ గా వ్యవహరించటానికి సైన్ చేసారని సమాచారం. దీనికిగాను ఆయన 5కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట. అళాగే మూడు సంవత్సరాలకు గాను ఎన్టీఆర్ ఈ బ్రాండ్ తో ఎగ్రిమెంట్ చేసుకున్నారు.

మరోపక్క ఎన్టీఆర్ మల్టీప్లెక్స్ రంగంలోకి దిగే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నిర్మించే ప్లాన్ చేస్తున్నాట్లు చెప్పుకుంటున్నారు. హీరోగా, బ్రాండ్ అంబాసిడర్ గా, థియేటర్స్ ఓనర్ ఎన్టీఆర్ ఫుల్ బిజీ కానున్నారన్నమాట. 

కెరీర్ విషయానికి  వస్తే..రీసెంట్ గా  ‘అరవింద సమేత’ తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఎన్టీఆర్ కొద్ది గ్యాప్ తీసుకుని తన తదుపరి చిత్రం మొదలెట్టేసారు.   ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీ స్టారర్ చిత్రం లో నటిస్తున్నాడు. 2020 లోఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.