యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో  కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతోంది.

 

#NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందిస్తుండగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు. 

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఏప్రిల్ లో ఈ  చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది. 

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, వంటి ఘనవిజయం సాధించిన  చిత్రాలను నిర్మించిన విషయం విదితమే.