యాక్షన్ సీన్ తో మొదలుపెడతారట

NTR trivikram film shoot starts with action scene
Highlights

కొట్టుకోవడానికి రెడీ అంటున్న తారక్

జైలవకుశ వచ్చి ఆరు నెలలు దాటింది. ఫ్యాన్స్ తారక్ ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తారక్ త్రవిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన విషయం తెలిసిందే.    ఈ చిత్రం శుక్రవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు . ఈ చిత్రం కోసం యంగ్ టైగర్ 20 కిలోల బరువు తగ్గిన విషయం తెలిసిందే. హాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్.. హీరోకి జిమ్‌లో హార్డ్‌గా ట్రైనింగ్ ఇచ్చాడు. హైదరాబాద్ శివార్లలో వారం రోజులపాటు యాక్షన్ సీన్స్ చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్.

ఈ సీన్స్‌లో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. భరత్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ని వచ్చిన ఎన్టీఆర్, స్లిమ్‌గా, స్టైలిష్‌గా కనిపించాడు. ఫైనల్ మేకోవర్‌లో ఏ విధంగా వుంటాడనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. అజ్ఞాతవాసి డిజాస్టర్‌తో ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ హిట్ కొట్టాలనే ఆలోచనతో వున్నాడు. స్టోరీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు చాలా సమయాన్ని కేటాయించాడు ఆయన. ఇందులో ఎన్టీఆర్‌తో పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది.

loader