ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఈ వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేయనుంది. ఇక 10 రోజుల క్రితం విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మిలియన్ వ్యూస్ ను దాటేస్తోంది. 

రీసెంట్ గా 10 మిలియన్ వ్యూవ్స్ ని క్రాస్ చేసిన ఈ ట్రైలర్ జనాలను మరింతగా ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమా ఎన్ని రికార్డులు అందుకుంటుందో అనే ఆలోచన కన్నా అసలు స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ డోస్ బాగా పెరిగిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ నటించిన ఓ సినిమాకు బిజినెస్ కూడా గట్టిగా పెరుగుతోంది. 

రీసెంట్ గా శాటిలైట్-డిజిటల్ రైట్స్ ద్వారా 30 కోట్లకు పైగా ముందే లాభాలను అందుకున్న ఈ బయోపిక్ త్వరలోనే  ప్రీ రిలీజ్ ఇతర బిజినెస్ ను కూడా క్లోజ్ చేయనుంది. చూస్తుంటే ఓపెనింగ్స్ ను గట్టిగా రాబట్టేలా ఉందని ట్రైలర్ తో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. రికార్డులు బద్దలవ్వడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను బాలకృష్ణ - సాయి కొర్రపాటి - విష్ణు ఇందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.