దసరా బరిలో జైలవకుశ, స్పైడర్ జై లవకుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం,, ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తం కలిపితే ఎన్టీఆర్ ముందంజ

జూనియర్ ఎన్టీఆర్ లవకుశ, మహేష్ బాబు స్పైడర్ సినిమాలు ఈ దసరా సీజన్ లో బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలిచాయి. ఈ సీజన్ లో రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. లవకుశలో ఎన్టీఆర్ నటనకు నీరాజనాలు పలుకుతుంటే... మహేష్ నుంచి స్పైడర్ లో ఆశించినంత రాలేదని అభిమానులు నిరాశ పడుతున్నారు.

మహేష్ బాబు తొలిసారి నటించిన ఈ బైలింగువల్ చిత్రంలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ శివగా నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన స్పైడర్ మిక్స్ టాక్ తో రన్ అవుతోంది. జైలవకుశ రిలీజైన వారం గ్యాప్ లో రిలీజై.. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద 38 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

మరోవైపు సెప్టెంబర్ 21న రిలీజైన జైలవకుశ తొలిరోజు 48 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించింది. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొత్తానికి తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తే మహేశ్ బాబు కంటే ఎన్టీఆర్ ముందంజలో వున్నారని స్పష్టమవుతోంది.