అన్న కోసం సప్త సముద్రాలు దాటి వస్తున్న తమ్ముడు

NTR to grace Kalyarams MLA Audio launch
Highlights

  • ఎన్టీఆర్ చిత్రాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంటాడు
  • జై లవకుశ చిత్రం ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించడం విశేషం
  • త్వరలో జరగనున్న అన్నయ్య ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది

ఎన్టీఆర్ కెరీర్ లో చాలా ఎత్తు పల్లాలు చూశాడు. పేరుకి నందమూరి వంశమైన కుటుంబం మొత్తం ఆయనను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కానీ అతని టాలెంట్ తో దూసుకుపోతున్నాడు.అతనికంటు సోంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మొత్తం అందరి చూపు ఎన్టీఆర్ వైపే. ఎన్టీఆర్ చిత్రాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తున్నాయి. త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాలలో నటించేందుకు ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. , ఎన్టీఆర్ రాంచరణ్ తో కలిసి రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన వర్క్ షాప్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్, చరణ్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎంత డెడికేషన్ చూపిస్తాడో కుటుంబ బంధాలకు కూడా అంతే విలువ ఇస్తాడు. అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ అన్న కోసం ఇండియా రాబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునే వార్తే ఇది.

జై లవకుశ చిత్రం ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించడం విశేషం. ఇటీవల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య బంధం బాగా పెరిగింది.కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు చిత్రాలతో నటిస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో చిత్రం నా నువ్వే. ఈ చిత్రం జయేంద్ర దర్శకత్వం లో రూపొందుతోంది. తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఎమ్మెల్యే చిత్రం గురించి అంతటా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.ఈ చిత్ర టీజర్ కూడా ఆకట్టుకుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్, స్టిల్స్ ని పరిశీలిస్తే కాజల్, కళ్యాణ్ రామ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఆడియో వేడుక కోసం హైదరాబాద్ తిరిగి వస్తున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. సోదరుడి ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరైతే అభిమానులకు పండగే.

loader