'టీవి షో'కు ఎన్టీఆర్ అసలు రెమ్యునరేషన్ ఎంత?
గతంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో మరోసారి అలరించడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఇందులో ఆయన కొత్త గెటప్‌లో కనపడుతున్నాడు.ఇక్కడ మీరు ఏం గెలుచుకున్నా గెలుచుకోకపోయినా.. జీవితంలో ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ ను మాత్రం మీకు వచ్చేలా చేస్తా అంటూ ప్రామిస్ చేయడం ప్రోమో కే హైలైట్ గా నిలిచింది.
'రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ పిలుస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గతంలో నాగార్జున, చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ అలరించారు. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షోకి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ అంటున్నారు.
గతంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో మరోసారి అలరించడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఇందులో ఆయన కొత్త గెటప్‌లో కనపడుతున్నాడు.ఇక్కడ మీరు ఏం గెలుచుకున్నా గెలుచుకోకపోయినా.. జీవితంలో ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ ను మాత్రం మీకు వచ్చేలా చేస్తా అంటూ ప్రామిస్ చేయడం ప్రోమో కే హైలైట్ గా నిలిచింది.
అంతే కాదు లాస్ట్ లో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. సైనింగ్ ఆఫ్ మీ రామారావు అంటూ ప్రోమోని చాలా సింపుల్ గా ముగించేశారు. ఈ నేైపధ్యంలో ఈ షోపై అంచనాలు పెరిగాయి. ఈ షో మే మొదటి వారం నుంచి మొదలు కానుంది. అరవై ఎపిసోడ్స్ దాకా ఎగ్రిమెంట్ ప్రకారం ప్లాన్ చేయనున్నారు.
ఇక సినిమాల్లో స్టార్ గా వెలుగుతున్న ఎన్టీఆర్ ని టీవి షోకు తీసుకు రావాలంటే ఎంత రెమ్యునేషన్ ఇవ్వాలి. అదే అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇందు నిమిత్తం ఎన్టీఆర్ కు పదికోట్లు చెల్లించటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఏడు కోట్లు తీసుకుంటున్నారనే మరో వార్త కూడా హల్‌చల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్, తారక్ గా తనను తాను చెప్పుకుంటూ వస్తున్న యంగ్ టైగర్ ఈ ప్రోమోలో మాత్రం రామారావు అంటూ ఫ్యాన్స్ కు, బుల్లితెర అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.
గతంలో మా టీవీ లో ఈ షో ప్రసారమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగో సీజన్ రాబోతుంది. గతంలో నాగార్జున, చిరంజీవి లు హోస్ట్ లు గా చేయగా ఇప్పుడు ఆ అవకాశం తారక్ దగ్గరకి వచ్చింది. త్వరలోనే ఈ షో ప్రసారమయ్యే తేదీ, మిగతా వివరాలు వెల్లడి చేస్తామని సన్ నెట్ వర్క్ తెలిపింది.