బిగ్ బాస్ షో పై రోజు రోజుకు పెరుగుతున్న ఆసక్తి పార్టిసిపెంట్స్ వెరైటీ యాక్ట్స్ తో పెరుగుతున్న క్రేజ్ రేటింగ్స్ లో అందనంత రేంజ్ కు స్టార్ మా
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో దుమ్మురేపుతోంది. వారం వారం రేటింగ్ భారీగా పెరిగిపోతోంది. మొదట్లో కంటే ఇప్పుడు షో రేటింగ్ మరింతా పెరిగిపోయింది.. మొదటి వారం షో రేటింగ్ కంటే ఇప్పుడు నాలుగు రేట్లు పెరిగిపోయింది. రీసెంట్ వీక్ రిపోర్ట్ ప్రకారం 5,75,255 వ్యూయర్ ఇంప్రెషన్స్‌తో స్టార్ మా టాప్ తెలుగు ఛానల్‌గా నిలిచింది. అలాగే టాప్ ఫైవ్ కార్యక్రమాల్లో కూడా స్టార్ మా ఛానల్ కార్యక్రమాలే మూడు ఉన్నాయి. మా టీవీ రేటింగ్స్ ఊహించనంత స్పీడ్‌గా పెరగడానికి కారణం బిగ్‌బాస్ షోలో ముఖ్యంగా ఎన్టీఆర్ ఫర్మార్మెన్సే అని చెప్పొచ్చు.
మిక్స్‌డ్ టాక్ వస్తున్నప్పటికీ ఈ షో సూపర్ హిట్టేనని రేటింగ్స్ చెబుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో పాటిస్పెట్ చేస్తున్న హంగామా రోజురోజుకు పెరుగుతోంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్.. ఇలా నవరసాలు కలగలిసిన షోగా మారుతుండటంతో ప్రేక్షకులకు ఈ షో పై ఆసక్తిపెరుగుతోంది. ఇక ఈ వీకెండ్ కూడా తారక్ అదిరిపోయే ఫర్మార్మెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద బిగ్‌బాస్ రియాల్టీ షో రోజురోజుకు రసవత్తరంగా మారుతోందంటున్నారు అభిమానులు.
