ఎందుకు మగాళ్లుగా పుట్టాం అని అనుకుంటారు : ఎన్టీఆర్

NTR Speech at Mahanadu Audio
Highlights

 ఎందుకు మగాళ్లుగా పుట్టాం అని అనుకుంటారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహానటి సావిత్రి గురించి, చిత్ర బృందం గురించి మాట్లాడటంతో పాటు చివర్లో మహిళల గురించి మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి ప్రస్తావించారు. 

"ఈ మధ్య ఆడవాళ్ల మీద అకృత్యాలు జరుగుతన్నాయి. ఒక్కసారి ఈ చిత్రం చూసిన తర్వాత.. ఎందుకు మనం మగాళ్లుగా పుట్టాం అనుకోకపోతే చూడండి. ట్రూ లేడీ సూపర్  స్టార్. ఒక ఆడదాని బలం ఏంటో.. ఆడవాళ్లు తలచుకుంటే ఏం సాధించగలుగుతారు అనేందుకు.. ఈ చిత్రం చూసి ఆడవాళ్లను గౌరవిస్తారు అని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు మన యంగ్ టైగర్. ఫలానా సంఘటన అని ఆయన ఏమీ గుర్తు చేయలేదు కానీ... ఎన్టీఆర్ మాటలను ఈ మధ్య కాలంలో జరిగిన అనేక సంఘటనలకు అన్వయిస్తున్నారు అభిమానులు.

loader