ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఎంత క్యూట్ గా ఉన్నారో.. తారక్ దీపావళి ఫ్యామిలీ పిక్ వైరల్
ఎన్టీఆర్ దీపావళి సెలబ్రేషన్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో తన ఇద్దరు కుమారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరి చూపు వారిపైనే ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చాలా వరకు ప్రైవేట్ లైఫ్‌కే పరిమితమవుతుంటారు. ఆయన బయట కనిపించడం చాలా అరుదు. సినిమా ఫ్రెండ్స్ తో కలిసి అడపాదడపా ఆయన పార్టీలో పాల్గొంటారు. సినిమాల్లో మహేష్‌బాబు, రామ్‌చరణ్ మంచి స్నేహితులు. బన్నీ కూడా యాడ్ అవుతుంటారు. అయితే చాలా రోజుల తర్వాత ఈ దీపావళిని చాలా ప్రత్యేకంగా మార్చుకున్నారు. సినిమా ఫ్రెండ్స్ అంతా కలుసుకున్నారు. రామ్‌చరణ్, ఉపాసనలు అందుకు పెద్దలుగా మారారు.
రామ్‌చరణ్ తన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ నిర్వహించారు. అందుకు తన స్నేహితులను ఆహ్వానించారు. ఇందులో వెంకటేష్ ఫ్యామిలీ, మహేష్‌బాబు ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ పాల్గొంది. వీరితోపాటు చిరంజీవి, సురేఖలు కూడా హాజరయ్యారు. అయితే ఇందులో తారక్ ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో తన భార్య లక్ష్మి ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అది వైరల్ అవుతుంది.
ఇందులో తారక్ కుర్తా ధరించారు. పిల్లలు అభయ్, భార్గవ్ సైతం అలాంటి డ్రెస్ వేసుకున్నారు. శారీలో లక్ష్మి ప్రణతి మెరిసిపోతుంది. అయితే ఇందులో ఎన్టీఆర్ కుమారులు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇద్దరు ఎంతో క్యూట్‌గా ఉన్నారు. అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఎంతో క్యూట్‌గా ఉన్నాడు. అచ్చు తారక్‌ని దించేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ నెట్టింట వైరల్ అవుతూ, ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కోస్టల్ ఏరియాలో ఓ గుర్తింపుకి నోచుకోని ఓ గ్రామంలో మనుషుల పోకడలు, వారి క్రూరత్వాన్ని ఆవిష్కరించేలా ఈ కథ సాగుతుందట. ఆద్యంత యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.
పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ మూవీకి వర్క్ చేస్తుండటం, భారీకాస్టింగ్, భారీ స్కేల్‌లో సినిమాని రూపొందిస్తుండటంతో దీనిపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో దీన్ని విడుదల చేయబోతున్నారు.